BREAKING
శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ దేశం అభ్యర్థికి బి ఫారం మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి.. పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్ మా కోడికి ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల మనోహర్

ఐకమత్యానికి ప్రోత్సాహం.. గ్రామాభివృద్ధికి కొత్త బాట

Select Suryaa Now
ఐకమత్యానికి ప్రోత్సాహం.. గ్రామాభివృద్ధికి కొత్త బాట

పార్వతీపురం, సూర్య:  గ్రామాభివృద్ధికి ఐకమత్యమే పునాది.. ప్రశాంత వాతావరణమే ప్రగతికి సోపానం అనే ఆశయంతో పార్వతీపురం మన్యం జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో విభేదాలు, కక్షలు, కార్పణ్యాలకు తావులేకుండా ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగితే గ్రామాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తాయనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా ఎన్. ప్రభాకర రెడ్డి నాయకత్వంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడంతో పాటు, వాటిని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఏకగ్రీవ పంచాయతీలకు ఆర్థిక ప్రోత్సాహం

గ్రామాల్లో సామరస్యపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ప్రత్యేక ప్రోత్సాహక నిధులను ప్రకటించింది.

*5,000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు, 5,001 నుంచి 10,000 వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10,000 మందికి పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు.

ఈ ప్రోత్సాహక నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సేవలు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో 782 వార్డులకు సింగిల్ నామినేషన్లు

జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎనిమిది మండలాల పరిధిలోని మొత్తం 2,116 వార్డులకు గాను 782 వార్డులకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. ఇది జిల్లాలోని ఎన్నికల ప్రక్రియలో నమోదైన ముఖ్యమైన పరిణామంగా నిలిచింది.

మండలాల వారీగా సింగిల్ నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి

పాలకొండ రెవెన్యూ డివిజన్

- గుమ్మలక్ష్మీపురం: 254 వార్డులకు 145.
- జియ్యమ్మవలస: 280 వార్డులకు 100.
- కురుపాం: 218 వార్డులకు 127.

పార్వతీపురం రెవెన్యూ డివిజన్

- గరుగుబిల్లి: 234 వార్డులకు 77.
- కొమరాడ: 290 వార్డులకు 104.
- బలిజిపేట: 244 వార్డులకు 58.
- పార్వతీపురం: 284 వార్డులకు 94.
- సీతానగరం: 312 వార్డులకు 77.

మొత్తంగా 2,116 వార్డులకు గాను 782 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి.

సమన్వయంతో సమగ్ర గ్రామాభివృద్ధి

ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు పరిపాలనాపరమైన సహకారం కూడా అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన నుంచి పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, ఉపాధి వరకు ప్రతి రంగంలోనూ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని, ఏకగ్రీవ పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.

ఐకమత్యమే అభివృద్ధికి అసలైన బలం

ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఎలాంటి కక్షలు, కార్పణ్యాలు, విభేదాలు లేకుండా ప్రజలంతా ఐకమత్యంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామాల్లో ఐకమత్యం.. పరిపాలనలో సమన్వయం.. అభివృద్ధిలో వేగం.. ఇదే ఏకగ్రీవ పంచాయతీల ద్వారా ఆదర్శ గ్రామాల నిర్మాణానికి జిల్లా యంత్రాంగం ముందుకు తీసుకెళ్తున్న కార్యాచరణ