BREAKING
శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ దేశం అభ్యర్థికి బి ఫారం మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి.. పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్ మా కోడికి ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల మనోహర్

మక్కువ ఎంపీపీగా మావుడి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక

Select Suryaa Now
మక్కువ ఎంపీపీగా  మావుడి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక

మక్కువ, సూర్య: సాలూరు నియోజకవర్గం లో రాజకీయ ప్రత్యేకత కలిగి ఉన్న మక్కువ మండల పరిషత్ అధ్యక్షురాలుగా వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు మావుడి రంగు నాయుడు సతీమణి మావుడి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వైస్ ఎంపీపీగా శంబర ఎంపీటీసీ అల్లు లీలావతి ఎన్నికయ్యారు. ఎంపీపీగా ఎన్నికైన మావుడి రామలక్ష్మి కి, వైస్ ఎంపీపీగా ఎన్నికైన అల్లు లీలావతికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి రామారావు ఎన్నిక పత్రాలను అందజేశారు. రాజకీయాలకు తొలి పరిచయమైన మావుడి రామలక్ష్మి ఎంపీపీగా ఎన్నిక కావడంతో కార్యాలయ వర్గాల తో పాటు అభిమానుల అభినందనలు వెల్లువెత్తాయి. ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి అధికార తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందిన ఐదుగురు ఎంపీటీసీలు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం టిడిపి నుండి గెలుపొందిన మండల పార్టీ అధ్యక్షులు గుళ్ల వేణుగోపానాయుడు భార్యతో సహా ఐదుగురు ఎంపీటీసీలు కార్యక్రమం నుండి వెళ్లిపోయారు. బీఎస్పీ పార్టీ నుండి ఏ వెంకంపేట ఎంపీటీసీగా గెలుపొందిన పెంట ఉమ కార్యక్రమానికి హాజరు కాలేదు. మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు మావుడి రంగు నాయుడు సతీమణి మావుడి రామలక్ష్మి మక్కువ మండల పరిషత్ అధ్యక్షుల పీఠాన్ని అధిష్టించడంతో మండల వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెళ్లువిరిసాయి. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ మక్కువలో మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయడం రాజకీయ ప్రత్యేకతను సంతరించుకుంది. విజయోత్సవ వేడుకల్లో భాగంగా మక్కువ పురవీధుల్లో అడుగడుగున మండల అధ్యక్ష పీఠాన్ని అలంకరించిన మావుడి రామలక్ష్మి తో పాటు మండల పార్టీ అధ్యక్షులు మావుడి రంగునాయుడు, మావుడి శ్రీనివాసరావులకు జన అభిమాన నీరాజనాల అందించారు. ఈ  సందర్భంగా  మక్కువలో బాణాసంచా మూతలతో ణ దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో మండలంలో గల అన్ని గ్రామాల వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.