BREAKING
శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ దేశం అభ్యర్థికి బి ఫారం మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి.. పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్ మా కోడికి ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల మనోహర్

మున్సిపల్ ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థిగా గర్రె సురేష్ బాబు.

Select Suryaa Now
మున్సిపల్ ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థిగా గర్రె సురేష్ బాబు.

​కావలి, మేజర్ న్యూస్ :   కావలి పట్టణంలో ప్రముఖ వ్యాపారిగా సుపరిచితులైన గర్రె సురేష్ బాబు మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. మున్సిపల్ ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఆయన తన ప్రత్యేక శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.  ​2014 నుంచి జరుగుతున్న సాధారణ ఎన్నికలతో పాటు మున్సిపల్ చైర్మన్ పదవికి సైతం ఆయన క్రమం తప్పకుండా నామినేషన్ దాఖలు చేస్తూ, ఎన్నికల బరిలో నిలుస్తూ వస్తున్నారు. ప్రతి ఎన్నికలోనూ బరిలో ఉండటం ఆయనకు అలవాటుగా మారింది.  ​ఈ సందర్భంగా గర్రె సురేష్ బాబు తన అభిప్రాయాలను పంచుకుంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, తనకు ఓటమి తప్పదనే విషయం తెలిసినప్పటికీ ఏమాత్రం వెనుకాడకుండా ధైర్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలను తిరుగుతూ ఓటింగ్ సరళిని ప్రత్యక్షంగా పరిశీలించడం, అలాగే కౌంటింగ్ ప్రక్రియలో స్వయంగా పాల్గొనడం తనకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొన్నారు. అందుకే ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికలోనూ పోటీ చేయాలన్నదే తన కోరిక అని ఆయన స్పష్టం చేశారు.  ​గెలిచినా, ఓడినా ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటూ తనదైన పంథాలో ముందుకు సాగుతున్న గర్రె సురేష్ బాబు వ్యవహారశైలి కావలి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.