ఏఎస్ పేటలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం
అనుమసముద్రంపేట, మేజర్ న్యూస్ : ఏఎస్ పేట మండలంలో ఎంపీటీసీ సభ్యులుగా ఇటీవల విజయం సాధించిన వారి చేత గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పిఓ వెంకటసుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏఎస్ పేట మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏ ఎస్ పేట బిట్ 2 సెగ్మెంట్లో వైసిపి అభ్యర్థి మిగిలిన 9 ఎంపీటీసీ సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు గురువారం జరిగిన సమావేశంలో ఎంపీటీసీ మెంబర్లుగా చౌట భీమవరం ఎంపీటీసీ మెంబర్ అబ్బూరి శ్రీవాణి, అనుమసముద్రం ఎంపీటీసీ మెంబర్ పులిమి సుధాకర్ రెడ్డి,హసనాపురం ఎంపీటీసీ మెంబర్ ముంగమూరు వసంత, గుంపర్లపాడు ఎంపీటీసీ మెంబర్ షేక్ దౌలత్, చిరమణ ఎంపీటీసీ మెంబర్ శాఖం భాగ్యమ్మ, ఏఎస్పేట బిట్టు 1 ఎంపీటీసీ మెంబర్ మహమ్మద్ షాహినా బేగం, జమ్మవరం ఎంపీటీసీ మెంబర్ సుగమంచి నరసింహులు, కావలి ఎడవల్లి ఎంపిటిసి మెంబర్ గొడుగునూరు విజయ్ కుమార్, గుడిపాడు ఎంపీటీసీ నెంబర్ నంది పోగు అబ్రహం, ఏఎస్పేట బిట్టు 2 ఎంపీటీసీ మెంబర్ షేక్ ఖాదర్ బాషా చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సమావేశంలో ఎంపీడీవో పి ప్రసన్నకుమారి ,తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు