పెదపులివర్రు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
పెదపులివర్రు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్:
వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని దారం సంధ్య అంబేద్కర్ నామినేషన్ల ను గురువారం ఎన్నికల అధికారి వద్ద దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు బలపరిచిన అభ్యర్థినిగా తాను ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. రానున్న 29వ తేదీ జరగనున్న ఎన్నికలలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సంధ్య అంబేద్కర్ కోరారు.