డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా ఆటల పోటీలు
- చదువుతో పాటు ఆటలు ఎంతో ముఖ్యం..ప్రిన్సిపాల్ రజనీకుమారి
- గ్రంథాలయాధికారి నల్ల మధుసూదనరావు
- గురుకుల పాఠశాలలో ఉత్సాహంగా ఆటల పోటీలు
గరుగుబిల్లి, సూర్య: గ్రంథాలయ వారోత్సవాలలో భాగముగా విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు స్థానిక శాఖ గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధుసూదనరావు ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల లో విద్యార్థినులకు గురువారం వివిధ రకాల ఆటల పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ అరసాడ రజనీకుమారి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా, శారీరక దృఢత్వం మరియు మానసిక ఉల్లాసం కోసం క్రీడల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. శాఖ గ్రంధాలయం నిర్వాహకులు నల్ల మధుసూదనరావు మాట్లాడుతూ గ్రంథాలయాలను విని యోగించుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మధుసూదన రావు కోరారు.అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థినులకు మ్యూజికల్ చైర్ ,పరుగు పందెం తదితర పోటీలను నిర్వహించారు.పోటీల్లో విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు.విజేతలకు త్వరలోనే బహుమతులు అందజేయ నున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల గ్రంథాలయ అధికారి కోట మాధవి తోపాటు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.