BREAKING
జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మెదక్ టూరిజం అభివృద్ధిపై ‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ జడ్పీ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. డిసెంబర్ 12న ఢిల్లీలో ‘చలో ఢిల్లీ – కర్మచారి ఆక్రోశ్ ర్యాలీ’ సెట్టూరు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన పాలబండ్ల భారతి వరి గడ్డివామి దగ్ధం..! -రూ.40 వేలు నష్టం..!! మక్కువ ఎంపీపీగా మావుడి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక జలదంకిలో జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు ఐకమత్యానికి ప్రోత్సాహం.. గ్రామాభివృద్ధికి కొత్త బాట తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ బోయిని సంపత్ కు ధన్యవాదాలు తెలిపిన పిల్లి సత్యనారాయణ గౌడ్ బలిజిపేటలో ఎమ్మెల్యే విజయచంద్రకు ఘన స్వాగతం.. టీడీపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ చెర్లోపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన గొల్ల వీరేష్ మున్సిపల్ ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థిగా గర్రె సురేష్ బాబు. అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ఐటీడీఏలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు విద్యార్థులకు పలు పోటీలు, బహుమతులు

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన

Select Suryaa Now
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్  మండలంలోని సౌత్ మోపూరు గ్రామంలో గురువారం రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువుల విక్రయాల్లో ప్రవేశపెట్టిన నూతన విధానంపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి పి. సత్యవాణి మరియు మండల సహాయ వ్యవసాయ సంచాలకులు బి. శ్రీదేవి, వ్యవసాయ అధికారి నాగమోహన్ హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి పి. సత్యవాణి మాట్లాడుతూ.. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తొందరపడి వరి నారుమడులు పోయవద్దని సూచించారు.తగిన వర్షపాతం లేకుండా వరి సాగు చేపడితే రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా మినుము, జొన్న, మొక్కజొన్న వంటి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.అనంతరం ఎరువుల విక్రయాల్లో ప్రవేశపెట్టిన నూతన విధానం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ (ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్స్ సేల్) గురించి వివరించారు. ఈ విధానం ద్వారా ఎరువుల కొనుగోలు కోసం దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదని, ఇంటి వద్ద నుంచే ఎరువులను బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ విధానం వల్ల రైతులకు సమయం ఆదా కావడంతో పాటు ఎరువుల కొనుగోలు ప్రక్రియ సులభతరం అవుతుందని వివరించారు.రైతులందరూ వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, ఎరువుల విక్రయాల నూతన విధానం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.