BREAKING
ఏఎస్ పేటలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం దేవుపల్లి లో బ్రహ్మోత్సవాలు.. - వాల్ పోస్టర్ ఆవిష్కరణ .... పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు రైతులకు మరింత చేరువ కానున్న సహకార సేవలు... - తుర్కలమద్దికుంటలో నూతన పీఏసీఎస్‌ ఏర్పాటు.. - ఘనంగా సంబరాలు ఘనంగా ఎంపిపి, వైస్ ఎంపిపిల ప్రమాణ స్వీకారోత్సవం యశోదలో తుంటి ఎముక విరుపులకు అత్యాధునిక చికిత్స -తుంటి ఎముక చికిత్సలో యశోద నయా టెక్నాలజీ -సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ బ్రిజేష్ కిడియూర్ ఎల్‌నినో ఎఫెక్ట్: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి నెల్లూరు రూరల్ మండల అధ్యక్షురాలిగా యాకసిరి లలిత ఈ నెల 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభ… వెయ్యి మంది ప్రతినిధులతో నిర్వహణకు ఏర్పాట్లు - స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం వివరాలు ఏఎస్ పేట మండల అధ్యక్షురాలుగా అబ్బూరి శ్రీవాణి

నెల్లూరు రూరల్ మండల అధ్యక్షురాలిగా యాకసిరి లలిత

Select Suryaa Now
నెల్లూరు రూరల్ మండల అధ్యక్షురాలిగా యాకసిరి లలిత

నెల్లూరు రూరల్m మేజర్ న్యూస్ :  నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఆమంచర్ల బిట్‌–1 ఎంపీటీసీ యాకసిరి లలిత, ఉపాధ్యక్షులుగా దేవరపాళెం ఎంపీటీసీ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. అనంతరం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.తొలుత మండల పరిషత్ సమావేశ మందిరంలో 12 మంది ఎంపీటీసీ సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి బి. శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. సభ్యుల మద్దతుతో చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించగా, అధ్యక్షురాలిగా యాకసిరి లలిత, ఉపాధ్యక్షులుగా వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి ఎంపికయ్యారు. వీరి ఎన్నిక ఏకగ్రీవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అనంతరం ప్రిసైడింగ్ అధికారి శ్రీదేవి మరియు ఎంపీడీవో వి. శైలేంద్ర కుమార్ వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.అదేవిధంగా సౌత్ మోపూరు ఎంపీటీసీ రాపూరు రత్నమ్మను నెల్లూరు రూరల్ మండల విప్‌గా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూరల్ జడ్పీటీసీ విజేత చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. పెనుబర్తి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా, మిగిలిన 11 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. నెల్లూరు రూరల్ మండలంలో 12కు 12 ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం ప్రభుత్వ పనితీరుకు, అభివృద్ధిపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. మండలంలో ఒక్క స్థానం కూడా వైసీపీకి దక్కలేదని పేర్కొన్నారు.ఇప్పటివరకు నెల్లూరు రూరల్ మండలంలో రూ.127 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ములుమూడి కలుజుతో పాటు, అత్యంత కష్టతరమైన పొట్టేపాళెం కలుజు పనులను పూర్తి చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నూతన పాలకవర్గం మరింత బాధ్యతతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీతో పాటు ఎంపీటీసీ సభ్యులందరినీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి చెందిన రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.