BREAKING
ఏఎస్ పేటలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం దేవుపల్లి లో బ్రహ్మోత్సవాలు.. - వాల్ పోస్టర్ ఆవిష్కరణ .... పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు రైతులకు మరింత చేరువ కానున్న సహకార సేవలు... - తుర్కలమద్దికుంటలో నూతన పీఏసీఎస్‌ ఏర్పాటు.. - ఘనంగా సంబరాలు ఘనంగా ఎంపిపి, వైస్ ఎంపిపిల ప్రమాణ స్వీకారోత్సవం యశోదలో తుంటి ఎముక విరుపులకు అత్యాధునిక చికిత్స -తుంటి ఎముక చికిత్సలో యశోద నయా టెక్నాలజీ -సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ బ్రిజేష్ కిడియూర్ ఎల్‌నినో ఎఫెక్ట్: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి నెల్లూరు రూరల్ మండల అధ్యక్షురాలిగా యాకసిరి లలిత ఈ నెల 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభ… వెయ్యి మంది ప్రతినిధులతో నిర్వహణకు ఏర్పాట్లు - స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం వివరాలు ఏఎస్ పేట మండల అధ్యక్షురాలుగా అబ్బూరి శ్రీవాణి

ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం వివరాలు

Select Suryaa Now
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం వివరాలు

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై గొడ్డలి పార్టీ నేతల పెదవి విప్పాలని ఎమ్మెల్యే  బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అక్రమాస్తుల కేసులో ఈడీ ఛార్జిషీటు వేస్తే సమాధానం చెప్పే బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక విమానంలో వచ్చి ఏకధాటిగా రెండు గంటలకు పైగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లే జగన్ రెడ్డి ఈడీ విచారణపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అసత్యాలను పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి కేసులపై చిన్న వార్త కూడా ఎందుకు రాయలేదని అని ధ్వజమెత్తారు. నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం స్థాపించారని విమర్శించారు. లిక్కర్ కుంభకోణం నుండి శాండ్ స్కామ్ వరకు వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్న దీనిపై ఆ పార్టీ నాయకులు తెలు కుట్టిన దొంగళ్లలా ఎందుకు ఉంటున్నారని దుయ్యబట్టారు.

“వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు, క్విడ్ ప్రో కో వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ల ద్వారా మరోసారి వాస్తవాలు ప్రజల ముందుకు వచ్చాయి. క్విడ్ ప్రో కో-1 నుంచి క్విడ్ ప్రో కో-2 వరకు జగన్మోహన్ రెడ్డి పాత్రను దర్యాప్తు సంస్థలు సాక్ష్యాధారాలతో సహా నిర్ధారించాయి. ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన సహజ వనరులను అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్వప్రయోజనాలకు ఎలా వాడుకున్నారో ఈడీ వేసిన ఛార్జిషీట్ స్పష్టం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి పక్కన చేరిన ఎంత మంచి వ్యక్తులు, అధికారులు, పారిశ్రామికవేత్తలైనా ఆయన అవినీతి మరక అంటక తప్పదని ఈ ఛార్జిషీట్ రుజువు చేస్తుంది. ఐఏఎస్ అధికారులను సైతం జైలుకి పంపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. 2008 జనవరి 9న కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నంలో 407 హెక్టార్ల సున్నపురాయి గనులను సజ్జల కుటుంబానికి చెందిన ఈశ్వర్ సిమెంట్స్‌కు మంజూరు చేశారు. ఆ తర్వాత 8న జీవో నెం. 321 ద్వారా వాటిని దాల్మియా సిమెంట్స్‌కు కట్టబెట్టారు. ఈ లీజుల వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్దారించాయి. ఈడీ ఛార్జిషీట్‌లో జగన్మోహన్ రెడ్డిని ఎ1 నిందితుడిగా నమోదు చేశారు. 2010లో దాల్మియా సిమెంట్స్ షేర్లను ఫ్రాన్స్ కంపెనీ పార్ఫిసిమ్ (PARFICIM) కొనుగోలు చేయడం ద్వారా వచ్చిన రూ. 139 కోట్లను జగన్మోహన్ రెడ్డి తన కంపెనీలకు మళ్లించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ మాఫియా తరహాలో 'టన్నులు' అనే కోడ్ భాషను ఆ రోజుల్లోనే ఉపయోగించారంటే జగన్ క్రిమినల్ మైండ్ సెట్ ఏంటో అర్ధమవుతుంది. ఈడీ స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్ సమాచారం ప్రకారం రూ. 55 కోట్లు హవాలా రూపంలో చేరింది వాస్తవం కాదా? సజ్జల కుటుంబానికి చెందిన ఈశ్వర్ సిమెంట్స్‌కు రూ. 2.14 కోట్ల మనీలాండరింగ్ జరిగిందని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేయడం నిజం కాదా? దీనిపై గొడ్డలి పార్టీ అధినేత, ఆ పార్టీ నాయకులు ఏం సమాధానం చెబుతారు.”

అవినీతి సొమ్ము వాటాలను పంచడానికి కూడా మనసు రాదా జగన్?
“దేశ చరిత్రలో 'క్విడ్ ప్రో కో' అనే పదాన్ని తొలిసారిగా సృష్టించిన వ్యక్తి జగన్. బోగస్ కంపెనీల ద్వారా రూ. 43 వేల కోట్ల అవినీతి సొమ్మును కూడబెట్టారు. ఈ అక్రమ సంపాదనతోనే భారతీ సిమెంట్స్ నుంచి సాక్షి పత్రిక వరకు, లోటస్ పాండ్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు వేల కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నారు. తండ్రి అధికారంతో అవినీతి సొమ్ము సంపాధించారు. తన అధికారంతో వ్యవస్థలను మ్యానేజ్ చేసి గత 13 ఏళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్న వ్యక్తి జగన్. సుమారు 141 డిశ్చార్జ్ పిటిషన్లు, 3,400కు పైగా వాయిదాలతో విచారణ నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో కూడా తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి వద్ద పనిచేసే ఒక సాధారణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ఫిలిప్పిన్స్, థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించి వెయ్యి కోట్ల రూపాయలు కూడబెట్టాడంటే, ఆ అవినీతి సామ్రాజ్యం ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన దగ్గర పనిచేసిన ఉద్యోగులే వేల కోట్లు సంపాధిస్తే జగన్ ఎన్ని లక్షల కోట్లు సంపాధిస్తున్నాడో ప్రజలు తెలుసుకోవాలి. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై గానీ, లిక్కర్ కుంభకోణం ఆరోపణలపై గానీ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు మౌనవ్రతం పాటిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు, ఆస్తుల పంపకాలపై సొంత తల్లి, చెల్లి లేవనెత్తిన అంశాలకు కూడా వారు సమాధానం చెప్పడం లేదు.” ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నేతలకు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.