63 రోజుల్లో అమ్మవారి హుండీ ఆదాయం రూ.29.29 లక్షలు
దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.29,29,478 వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కాకర్ల ఆదిశేష నాయుడు తెలిపారు.ఈ సందర్భంగా అమ్మవారి భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపులను దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు, కోటప్పకొండ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ పర్యవేక్షణలో దేవస్థాన సిబ్బంది, భక్తులు కలిసి లెక్కించారు. మొత్తం 63 రోజుల కాలానికి సంబంధించి హుండీ ఆదాయం రూ.29,29,478 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.అమ్మవారిపై భక్తులు చూపుతున్న విశేష భక్తిశ్రద్ధలకు హుండీ ఆదాయం నిదర్శనంగా నిలిచిందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి