నేడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం
నేడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్:
మండల కేంద్రమైన భట్టిప్రోలులో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి(రథం గుడి)దేవస్థానంలో శుక్రవారం లక్ష బిల్వార్చన మహోత్సవ కార్యక్రమం కొడాలి శంకరరావు ఆధ్వర్యంలో జరుగుతుందని దేవస్థానం ట్రస్ట్ శంకరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూజలో దామర్ల నాగేశ్వరరావు--విజయనిర్మల దంపతులు పాల్గొంటారని ఆయన తెలిపారు. పూజా కార్యక్రమాలను దండిభోట్ల ఛాయానాథ్, దండిబోట్ల రాజేంద్ర ప్రసాద్ లు నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశంలో దేవాలయ అధికారి మల్లెల రమేష్, తిరువీధుల వెంకటేశ్వరరావు (యూత్) తోటకూర శంకరరావు తదితరులు పాల్గొన్నారు.