BREAKING
దేవుపల్లి లో బ్రహ్మోత్సవాలు.. - వాల్ పోస్టర్ ఆవిష్కరణ .... పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు రైతులకు మరింత చేరువ కానున్న సహకార సేవలు... - తుర్కలమద్దికుంటలో నూతన పీఏసీఎస్‌ ఏర్పాటు.. - ఘనంగా సంబరాలు ఘనంగా ఎంపిపి, వైస్ ఎంపిపిల ప్రమాణ స్వీకారోత్సవం యశోదలో తుంటి ఎముక విరుపులకు అత్యాధునిక చికిత్స -తుంటి ఎముక చికిత్సలో యశోద నయా టెక్నాలజీ -సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ బ్రిజేష్ కిడియూర్ ఎల్‌నినో ఎఫెక్ట్: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి నెల్లూరు రూరల్ మండల అధ్యక్షురాలిగా యాకసిరి లలిత ఈ నెల 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభ… వెయ్యి మంది ప్రతినిధులతో నిర్వహణకు ఏర్పాట్లు - స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం వివరాలు ఏఎస్ పేట మండల అధ్యక్షురాలుగా అబ్బూరి శ్రీవాణి చంద్రగిరి ఎంపీపీగా సరితా రమణమూర్తి, వైస్ ఎంపీపీగా కె సునీల్ ఎన్నిక: 14 మంది టీడీపీ ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. ఇద్దరు వైసీపీ సభ్యుల గైర్హాజరు! 63 రోజుల్లో అమ్మవారి హుండీ ఆదాయం రూ.29.29 లక్షలు ఎమ్మెల్యే సహకారంతో మండల ప్రజా సమస్యల పరిష్కరిస్తా ఎంపీపీ మంజుల రాఘవేంద్ర

రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజబాబు

Select Suryaa Now
రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజబాబు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో గురువారం దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పెద్ద ఉల్లగల్లు, రాజంపల్లి, సింగన్నపాలెం, విఠలాపురం తోపాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు నామినేషన్ జరుగుతున్న విధానాలను మరియు అక్కడ పరిస్థితులను పలు విషయాల గురించి అక్కడ ఉన్న ప్రజలను మరియు అధికారులను అడిగి తెలుసుకొని, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు అధికారులు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, అభ్యర్థులు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ నామినేషన్లు దాఖలు చేసుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100, 200 మీటర్ల పరిధిలో నిబంధనల మేరకు పోలీసు ఆంక్షలు అమలు చేస్తూ, పోలీసు యాక్ట్ 30, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేయాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో నిరంతర పోలీసు నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు.కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.నామినేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, ప్రతి కదలికను నిశితంగా గమనించాలని సూచించారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించరాదని సూచించారు. కొనసాగనున్న నామినేషన్ల ప్రక్రియలో ఎక్కడా చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలకు కూడా తావులేకుండా, ఎలాంటి  ఆటంకాలు లేకుండా ప్రతి అభ్యర్థి తన నామినేషన్‌ను స్వేచ్ఛగా దాఖలు చేసుకునే విధంగా పోలీసు యంత్రాంగం సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు, అభ్యర్థులు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.

జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారి వెంట దర్శి డిఎస్పి బాలమురళికృష్ణ, ఎస్బి యం. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ముండ్లమూరు ఎమ్మార్వో గారు మరియు ఇతర శాఖల అధికారులు ఉన్నారు.