BREAKING
బచ్చే హల్లి గ్రామపంచాయతీ ఎంపీటీసీ గా గొల్ల జ్యోతి ప్రమాణ స్వీకారం కొత్త ఫార్మ్ బిల్లును తక్షణమే ఆమోదించాలి..కాంగ్రెస్‌కు డొనాల్డ్ ట్రంప్ పిలుపు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజబాబు నేడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం ఆత్మకూరులో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం పెరిగిన చమురు ధరల లాభాలు వాటాదారులకు..అమెరికా షేల్ కంపెనీల కీలక నిర్ణయం అద్దంకి సీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆరోగ్య శాఖ కమిషనర్ ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం పెరుగు పాలెం ఎంపీటీసీగా జ్యోతి ప్రమాణ స్వీకారం యస్ బ్యాంక్ ఏటీ-1 బాండ్ల వివాదం..రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్బీఐకి లేఖ ఎంపీటీసీ సభ్యులను సన్మానించిన ఎంపీడీవో ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక అమెజాన్ అడవుల పరిరక్షణకు 100 మిలియన్ డాలర్లకు పైగా గ్రాంట్లు కావలి.. 12వ వార్డులో మునగా మురళి విస్తృత ప్రచారం. బ్రూక్‌డేల్ సీనియర్ లివింగ్‌లో 5 శాతం దాటిన కరోనేడ్ వాటా

ఆత్మకూరు మండల అధ్యక్షురాలుగా దావా సుమన్య ఏకగ్రీవంగా ఎన్నిక

Select Suryaa Now
ఆత్మకూరు మండల అధ్యక్షురాలుగా దావా సుమన్య ఏకగ్రీవంగా ఎన్నిక

ఆత్మకూరు,మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మండల పరిషత్ అధ్యక్షురాలుగా తెలుగుదేశం ఎంపిటిసి మెంబర్ ధావా సుమన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ప్రిసైడింగ్ అధికారి వై. కోటేశ్వరరావు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని తొమ్మిది మంది ఎంపీటీసీలు హాజరయ్యారు.  తొమ్మిది మందిలో ఒకరు వైసిపి ఎంపీటీసీమెంబర్ కాగా మిగతా ఎనిమిది మంది తెలుగుదేశం ఎంపీటీసీ సభ్యులు. కరకంపాడు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన దావా సుమన్యను ఏకగ్రీవంగా సభ్యులందరూ ఎన్నుకున్నారు. ఈ మేరకు సుమన్యచేత  అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీపీగా ఎన్నికైన దావా సుమన్యను అధికారులు,ఎంపీటీసీ సభ్యులు తదితరులు అందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో ఆమె ఎంపిటిసి మెంబర్ గా పోటీ చేసి విజయం సాధించారు.