BREAKING
బచ్చే హల్లి గ్రామపంచాయతీ ఎంపీటీసీ గా గొల్ల జ్యోతి ప్రమాణ స్వీకారం కొత్త ఫార్మ్ బిల్లును తక్షణమే ఆమోదించాలి..కాంగ్రెస్‌కు డొనాల్డ్ ట్రంప్ పిలుపు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజబాబు నేడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం ఆత్మకూరులో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం పెరిగిన చమురు ధరల లాభాలు వాటాదారులకు..అమెరికా షేల్ కంపెనీల కీలక నిర్ణయం అద్దంకి సీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆరోగ్య శాఖ కమిషనర్ ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం పెరుగు పాలెం ఎంపీటీసీగా జ్యోతి ప్రమాణ స్వీకారం యస్ బ్యాంక్ ఏటీ-1 బాండ్ల వివాదం..రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్బీఐకి లేఖ ఎంపీటీసీ సభ్యులను సన్మానించిన ఎంపీడీవో ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక అమెజాన్ అడవుల పరిరక్షణకు 100 మిలియన్ డాలర్లకు పైగా గ్రాంట్లు కావలి.. 12వ వార్డులో మునగా మురళి విస్తృత ప్రచారం. బ్రూక్‌డేల్ సీనియర్ లివింగ్‌లో 5 శాతం దాటిన కరోనేడ్ వాటా

ఉత్సాహంగా జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపిక పోటీలు

Select Suryaa Now
ఉత్సాహంగా జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపిక పోటీలు

నెల్లూరు కలెక్టరేట్,  మేజర్ న్యూస్  :  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపిక పోటీలను గురువారం ఉత్సాహంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఏ.సి. సుబ్బారెడ్డి క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు జరిగాయి.  జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఇన్‌ఛార్జి ఎం. పాండురంగారావు, దివ్యాంగులు, లింగమార్పిడి వ్యక్తులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎ. మొహమ్మద్ అయూబ్, సమగ్ర శిక్షా అభియాన్ సమ్మిళిత విద్య సమన్వయకర్త పి. ప్రసాదరావు, జిల్లా పారా క్రీడల సంఘం అధ్యక్షుడు టి.సి. మాల్యాద్రి నాయుడు, కార్యదర్శి కె. యాదగిరి ఈ ఎంపిక పోటీలను ప్రారంభించారు.  పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, వీల్‌చైర్ ఫెన్సింగ్, అంధుల గోల్‌బాల్, పారా తైక్వాండో, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 120 మంది దివ్యాంగ బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు.  వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 1, 2 తేదీల్లో విజయనగరంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పారా క్రీడా పోటీల్లో నెల్లూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.