పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నగర పర్యటనలో భాగంగా స్థానిక క్రాంతి నగర్ ప్రాంతంలో గురువారం పర్యటించారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ ను పరిశీలించారు. స్థానిక ప్రజల వేడుకల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రజలందరూ వినియోగించుకునేలా ప్రచారం కల్పించి, ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న వేడుకలు, శుభకార్యాలకు కమ్యూనిటీ హాల్ వేదికగా నిలిచేలా, నిర్వహణ లోపాలు లేకుండా నడిపించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం డి.ఈలు శ్రీనివాసులు రెడ్డి, సాయి కృష్ణ, శ్రీకాంత్, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.