రైల్వే గేటు అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కమిషనర్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నగర పర్యటనలో భాగంగా స్థానిక బి.వి. నగర్ - కరెంట్ ఆఫీస్ సెంటర్ రైల్వే గేటు అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు.
పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన మార్కింగ్ మేరకు బ్రిడ్జి నిర్మాణ పనులు జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. నిర్దేశించిన సమయంలోపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి త్వరితగతిన ప్రజల రాకపోకలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, టి.పి.బి.ఓ లు, ప్లానింగ్ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.