BREAKING
ఎంపీటీసీ సభ్యులను సన్మానించిన ఎంపీడీవో ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక అమెజాన్ అడవుల పరిరక్షణకు 100 మిలియన్ డాలర్లకు పైగా గ్రాంట్లు కావలి.. 12వ వార్డులో మునగా మురళి విస్తృత ప్రచారం. బ్రూక్‌డేల్ సీనియర్ లివింగ్‌లో 5 శాతం దాటిన కరోనేడ్ వాటా నూతన మునిసిపల్ చైర్మన్‌గా శ్రీరామ్ చినబాబు బాధ్యతలు : శుభాకాంక్షలు తెలిపిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు కాప్31 వేదికగా వాతావరణ నిధుల చర్చలు..ఎల్ నినో ప్రభావంతో పెరిగిన తీవ్రత ఆత్మకూరు మండల అధ్యక్షురాలుగా దావా సుమన్య ఏకగ్రీవంగా ఎన్నిక పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు టిడిపి మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కావ్య. . చరిత్ర సృష్టించిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఐపీఓ..నాస్‌డాక్‌లో రికార్డు స్థాయిలో షేర్ల విక్రయం నామినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి, శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఉత్సాహంగా జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపిక పోటీలు రెండవ 224 నామినేషన్ల దాఖలు

40వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బట్టేపాటి అశోక్‌కు బీ-ఫారం అందజేత

Select Suryaa Now
40వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బట్టేపాటి అశోక్‌కు బీ-ఫారం అందజేత

​కావలి, మేజర్ న్యూస్ :   కావలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 40వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బట్టేపాటి అశోక్‌కు గురువారం పార్టీ అధిష్టానం తరఫున బీ-ఫారం అందజేశారు. పార్టీ బీ-ఫారం అందుకున్న వెంటనే ఆయన తన మద్దతుదారులు, నాయకులతో కలిసి కావలి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారులకు బీ-ఫారాన్ని, నామినేషన్ పత్రాలను అందజేశారు.
​అనంతరం అశోక్ మొట్టమొదటిగా స్థానిక సీనియర్ నాయకులు (కావలి పీఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) జీడీడీ దివాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా దివాకర్ అశోక్‌ను అభినందించి, ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
​ఈ సందర్భంగా అభ్యర్థి బట్టేపాటి అశోక్ మాట్లాడుతూ, తాను ఎన్నో సంవత్సరాలుగా 40వ వార్డు ప్రజల మధ్యే ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని తెలిపారు. వార్డులోని ప్రతి సమస్యపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నానని గుర్తుచేశారు. వార్డును అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు 'సైకిల్'పై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను ఆయన అభ్యర్థించారు.
​ఈ కార్యక్రమంలో 40వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అశోక్ అభిమానులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు.


​