BREAKING
ఎంపీటీసీ సభ్యులను సన్మానించిన ఎంపీడీవో ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక అమెజాన్ అడవుల పరిరక్షణకు 100 మిలియన్ డాలర్లకు పైగా గ్రాంట్లు కావలి.. 12వ వార్డులో మునగా మురళి విస్తృత ప్రచారం. బ్రూక్‌డేల్ సీనియర్ లివింగ్‌లో 5 శాతం దాటిన కరోనేడ్ వాటా నూతన మునిసిపల్ చైర్మన్‌గా శ్రీరామ్ చినబాబు బాధ్యతలు : శుభాకాంక్షలు తెలిపిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు కాప్31 వేదికగా వాతావరణ నిధుల చర్చలు..ఎల్ నినో ప్రభావంతో పెరిగిన తీవ్రత ఆత్మకూరు మండల అధ్యక్షురాలుగా దావా సుమన్య ఏకగ్రీవంగా ఎన్నిక పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు టిడిపి మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కావ్య. . చరిత్ర సృష్టించిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఐపీఓ..నాస్‌డాక్‌లో రికార్డు స్థాయిలో షేర్ల విక్రయం నామినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి, శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఉత్సాహంగా జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపిక పోటీలు రెండవ 224 నామినేషన్ల దాఖలు

నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం

Select Suryaa Now
నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాను అక్వాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనించిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) మేనేజింగ్ డైరెక్టర్,  రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది నరసాపురంకు 390 కి.మీ, కళింగపట్నంకు 320 కి.మీ, గోపాల్‌పూర్ 410 కి.మీ, పూరీ 470 కి.మీ,  చెన్నై 610 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. రేపు మధ్యాహ్ననికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

శుక్రవారం(20-11-2026) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.