BREAKING
ఆదిత్య కళాశాలలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు జయంతి 40వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బట్టేపాటి అశోక్‌కు బీ-ఫారం అందజేత నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం జేపీమోర్గాన్ థర్డ్-పార్టీ వెండర్లపై సైబర్ దాడి ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులు మంజూరి.... ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించిన కమిషనర్ ఐరోపాలో ఏఐ పెట్టుబడులకు విద్యుత్ ఖర్చుల ముప్పు ఎంపీపీ ఈదురుకు ఆత్మీయ సన్మానం 32వ జాతీయ బాలల విజ్ఞాన సదస్సు(32 నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్)– 2026 దర్శి లో వైసీపీ నేతలు రౌడీయిజం. కావలి రూరల్ ఎంపీపీగా ఆవుల రామకృష్ణ, వైస్ ఎంపీపీగా చాగంటి వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక... పిఆర్ సి రిపోర్ట్ త్వరగా ఇవ్వాలి, 30శాతం ఐఆర్ ప్రకటించాలి:ఏపీటీఎఫ్ దక్షిణాఫ్రికాలో డెమోక్రటిక్ అలయన్స్‌కు చెక్ వింజమూరు మండలం ఎంపీపీగా గణపం ప్రమాణ స్వీకారం అమెరికాలో స్వల్పంగా పెరిగిన వారపు నిరుద్యోగ క్లెయిమ్‌లు

కొలువుదీరిన మండల పరిషత్ పాలకవర్గాలు : నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి

Select Suryaa Now
కొలువుదీరిన మండల పరిషత్ పాలకవర్గాలు : నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి

పర్చూరు, మేజర్‌ న్యూస్‌ :

పర్చూరు నియోజకవర్గంలోని మండల పరిషత్‌లలో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. గురువారం కారంచేడు, పర్చూరు, మార్టూరు, యద్దనపూడి మండలాల్లో నూతనంగా ఎన్నికైన మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు), ఉపాధ్యక్షులు (వైస్ ఎంపీపీలు), ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హాజరై నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులకు అభినందనలు తెలిపారు.అంతకుముందు ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఆరు మండలాలకు ఎంపీపీ అభ్యర్థులు

టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఎంపీపీ అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫార్సు చేశారు. మార్టూరుకు మేకల మాధురి, యద్దనపూడికి గుదే తారకరామారావు, పర్చూరుకు కొల్ల శ్రీనివాసరావు, కారంచేడుకు సికా సాల్మన్ రాజు, ఇంకొల్లుకు కోటా శ్రీదేవి, చిన్నగంజాంకు విక్రం దీప్తి లు ఎంపీపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు

వైస్ ఎంపీపీ స్థానాల్లో కూటమి సమన్వయం

వైస్ ఎంపీపీ పదవుల ఎంపికలో కూటమి పార్టీల మధ్య సమన్వయానికి ప్రాధాన్యమిచ్చారు. ఆరు స్థానాల్లో ఐదు తెలుగుదేశం పార్టీకి, ఒక స్థానం జనసేన పార్టీకి కేటాయించారు. మార్టూరులో అర్వపల్లి హేమలత, యద్దనపూడిలో గుంజి భూలక్ష్మి, పర్చూరులో విన్నకోట సతీష్, కారంచేడులో కొసరాజు సురేంద్రబాబు, చిన్నగంజాంలో గొల్లపోతు వెంకటేశ్వర్లు టీడీపీ తరఫున, ఇంకొల్లులో నున్న వెంకట్రావు జనసేన తరఫున వైస్ ఎంపీపీలుగా ప్రమాణస్వీకారం చేశారు.

పసుపు కండువాలతో భారీ ర్యాలీగా..

ఆరు మండలాల్లో ఎంపీటీసీలు పచ్చ కండువాలతో భారీ ర్యాలీలుగా ఆయా మండల కార్యాలయాలకు చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీలకు వైస్ ఎంపీపీలకు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు తెలిపారు.

మెరుగైన పాలన...

స్థానిక సంస్థల్లో కూటమిని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఎంపికలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగాలనిఎమ్మెల్యే  ఏలూరి సూచించారు.