BREAKING
ఎంపీటీసీ సభ్యులను సన్మానించిన ఎంపీడీవో ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక అమెజాన్ అడవుల పరిరక్షణకు 100 మిలియన్ డాలర్లకు పైగా గ్రాంట్లు కావలి.. 12వ వార్డులో మునగా మురళి విస్తృత ప్రచారం. బ్రూక్‌డేల్ సీనియర్ లివింగ్‌లో 5 శాతం దాటిన కరోనేడ్ వాటా నూతన మునిసిపల్ చైర్మన్‌గా శ్రీరామ్ చినబాబు బాధ్యతలు : శుభాకాంక్షలు తెలిపిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు కాప్31 వేదికగా వాతావరణ నిధుల చర్చలు..ఎల్ నినో ప్రభావంతో పెరిగిన తీవ్రత ఆత్మకూరు మండల అధ్యక్షురాలుగా దావా సుమన్య ఏకగ్రీవంగా ఎన్నిక పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు టిడిపి మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కావ్య. . చరిత్ర సృష్టించిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఐపీఓ..నాస్‌డాక్‌లో రికార్డు స్థాయిలో షేర్ల విక్రయం నామినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి, శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఉత్సాహంగా జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపిక పోటీలు రెండవ 224 నామినేషన్ల దాఖలు

దర్శి లో వైసీపీ నేతలు రౌడీయిజం.

Select Suryaa Now
దర్శి లో వైసీపీ నేతలు రౌడీయిజం.

దర్శి లో వైసీపీ నేతలు రౌడీయిజం.

కత్తులు, ఇనప రాడ్లు, కొడవలు ,కారంతో టిడిపి కార్యకర్తలు పై దాడి.

టిడిపి కార్యకర్తలకు గాయాలు.

పోతవరంలో రణరంగం సృష్టించిన వైసీపీ కార్యకర్తలు.

పక్కా ప్లాన్ ప్రకారం టిడిపి కార్యకర్తలపై దాడి.

సర్పంచ్ అభ్యర్థి సోదరుడికి తీవ్ర గాయాలు.

మహిళ పై భౌతిక దాడులకు దిగిన వైసిపి నేతలు.

సూర్య న్యూస్ దర్శి. దర్శి లో నామినేషన్ ల సందర్భంగా వైసీపీ నేతలు రణరంగం సృష్టించారు. పక్కా ప్లాన్ ప్రకారం టిడిపి  కార్యకర్తలపై వైసిపి నాయకులు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. మండలంలోని పోతవరం గ్రామంలో నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులు చేశారు. వెంకటచలం పల్లి గ్రామానికి  టిడిపి నాయకులు నామినేషన్లు వేయటానికి పోతవరం నామినేషన్ కేంద్రాల వద్దకు వచ్చారు. అప్పటికే నామినేషన్ వేసి వచ్చిన చలివేంద్రం వైసిపి నేతలు నామినేషన్ వేయటానికి వచ్చిన టిడిపి కార్యకర్తలపై దాడి చేశారు. రెండు ఆటోల్లో  సుమారు 50 మంది  కత్తులు ఇనప రాడ్లు గొడవలు కారం తీసుకువచ్చి దాడి చేశారు. కొంతసేపు నామినేషన్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు రణరంగం సృష్టించారు. సర్పంచ్ టిడిపి అభ్యర్థి సోదరుడు ఎర్రగుంట్ల  అచ్చయ్య పై వైసీపీ నేతలుదాడి చేశారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అచ్చయ్య ను హాస్పటల్ కు తరలించారు. సర్పంచ్ అభ్యర్థి కి మద్దతుగా వచ్చిన మహిళలపై కూడా వైసీపీ నేతలు దాడులకు దిగారు.