వింజమూరు మండలం ఎంపీపీగా గణపం ప్రమాణ స్వీకారం
వింజమూరు, మేజర్ న్యూస్ : వింజమూరు మండల పరిషత్ అధ్యక్షునిగా గణపం బాలకృష్ణారెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేశారు మండలంలో 12 ప్రాదేశికాలు ఉండగా 9 ప్రాదేశిక స్థానాలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. గురువారం కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శేషగిరిరావు ఎంపీటీసీ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు అనంతరం సభ్యులు మండల పరిషత్ అధ్యక్షునిగా గణపం బాలకృష్ణారెడ్డిని మండల ఉపాధ్యక్షురాలుగా రేవు నూరి అనూషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మీడియా అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి స్థానిక జడ్పిటిసి సభ్యులు పల్లాల కొండారెడ్డి నూతనంగా ఎంపికైన అధ్యక్ష ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు ప్రతి ఎంపీటీసీ సభ్యుడు తమ పరిధిలోని ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా మండల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని మేకపాటి సూచించారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎంపీపీ గణపం బాలకృష్ణారెడ్డి ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాజకీయాలకు అతీతంగా మరియు మండల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా తమ పరిపాలన కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు.