ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించిన కమిషనర్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : ఇంటర్నేషనల్ టాయిలెట్స్ డే ను పురస్కరించుకొని నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మారుతి నగర్ పార్కు, అనగుంట పార్కులలో రెండు ప్రజా మరుగుదొడ్లను కమిషనర్ వై.ఓ నందన్ అధికారులతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ నెల్లూరు సాకారంలో భాగంగా ప్రజలందరికీ ఆరోగ్యకరమైన వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించి, ప్రజా మరుగుదొడ్ల సౌలభ్యం అందించే దిశగా అన్ని పార్కులలో మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతిఏటా నవంబర్ 19వ తేదీ ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు సౌకర్యవంతంగా, మరింత మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ శేషగిరిరావు, డి.ఈ.ఈ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.