32వ జాతీయ బాలల విజ్ఞాన సదస్సు(32 నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్)– 2026
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ & టెక్నాలజీ కౌన్సిల్ (APCOST) మరియు పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడిన
*జిల్లా స్థాయి జాతీయ బాలల విజ్ఞాన సంగమం (District Level National Children’s Science Congress – NCSC) – 2026* పోటీలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురంలో గురువారం విజయవంతంగా ముగిసాయి.
ఈ సంవత్సరం ఫోకల్ థీమ్ *“సుస్థిరత కోసం సైన్స్ మరియు ఆవిష్కరణలు”* (Science and Innovation for Sustainability).
జిల్లాలోని వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 45 బాల శాస్త్రవేత్తల జట్లు వారి మార్గదర్శక ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వారి యొక్క పరిశోధన ప్రాజెక్టుల ప్రదర్శనను జిల్లా విద్యాశాఖ అధికారిగారి చే నియమించబడిన న్యాయ నిర్ణేతల బృందం శేషు కుమార్ (కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు) మరియు డ (ఆర్ట్స్ కళాశాల వృక్ష శాస్త్ర అధ్యాపకులు) సునిశితంగా పరిశీలించి సమగ్ర సమీక్ష అనంతరం మొత్తం *3* ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఎంపిక చేయబడ్డాయి.
జిల్లా ఇన్ ఛార్జ్ విద్యాశాఖ అధికారి పి శ్రీనివాసులు విజేతలను, వారి మార్గదర్శక ఉపాధ్యాయులను అభినందించారు. అలాగే ఎంపికైన విద్యార్థులకు, గైడ్ టీచర్లకు ప్రశంసా పత్రాలు మరియు బహుమతులను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి చంద్ర శేఖర రెడ్డి అధ్యక్షత న జరిగిన
ఈ కార్యక్రమాన్ని జిల్లా సమన్వయకర్త పవని భాను చంద్ర మూర్తి , జిల్లా సైన్స్ అధికారి మార్తాల శ్రీనివాస రెడ్డి,అకడమిక్ కో అర్డినేటర్ ఒద్దుల రవి శేఖర్ లు పర్యవేక్షించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తంగిరాల నాగ జగన్నాథ్, విశ్రాంత ఉప విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసులు, తర్లపాడు ప్రధానోపాధ్యాయులు ముత్తోజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
జ్యూరీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు స్థానిక సమస్యలపై శాస్త్రీయ దృక్పథంతో ఆచరణాత్మక పరిష్కారాలు అందించిన తీరును ప్రశంసించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రాజెక్టులు మరింత సమగ్రమైన ప్రదర్శనకు సిద్ధం కావాలని సూచించారు.
ఎంపికైన 3 ప్రాజెక్టులు త్వరలో నిర్దేశించిన వేదికలో నిర్వహించబడే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొననున్నాయి.
రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికైన
విజేతల వివరాలు :
1.విద్యార్థి పేరు : షేక్ ఉస్మాన్
పాఠశాల పేరు : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు
ప్రాజెక్ట్ పేరు : ఎకో ఫ్రెండ్లీ బయో మల్చింగ్ షీట్
2. వి యశ్వంత్
ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్,గిద్దలూరు
ప్రాజెక్టు పేరు :సోప్ ప్రిపరేషన్ విత్ న్యాచురల్ ఇంగ్రిడియంట్స్
3. విద్యార్థి పేరు : డి.బాలాజీ నాయక్
పాఠశాల పేరు :ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్,గిద్దలూరు
ప్రాజెక్ట్ పేరు : ట్రైబల్ స్మార్ట్ గ్రైన్ బ్యాంక్