పిఆర్ సి రిపోర్ట్ త్వరగా ఇవ్వాలి, 30శాతం ఐఆర్ ప్రకటించాలి:ఏపీటీఎఫ్
గుంటూరు : ఉద్యోగులకు12వ పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ వెంటనే తెప్పించుకుని అమలు పర్చాలని కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థి ,ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి పాండురంగ వరప్రసాదరావు ప్రభుత్వాని డిమాండ్ చేశారు.జిల్లా కోర్ట్ ఎదురుగా ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు దాస్ గుడిపాటి అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముక్య అధితిగా పాల్గొన్న పాండురంగ వర ప్రసాదరావు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అన్ని సంఘాల నుంచి స్కేల్స్ పై ప్రతిపాదనలు స్వీకరించి రిపోర్ట్ ప్రభుత్వానికి అందించాలన్నారు.ఇప్పటికే పీఆర్సీ సమయం 3సంవత్సరాల సమయం దాటి పోయిందని ,రిపోర్ట్ సబ్మిషన్ ఆలస్యమైతే 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని అన్నారు. విద్యాశాఖా ధికారుల నిర్ణయాలు ఉపాధ్యాయులను గందరగోళ పరుస్తున్నాయన్నారు.పంచాయితీ ఎన్నికల లో స్టేజ్ 1&2 విధులు,ఎలక్షన్ ,కౌంటింగ్ ట్రైనింగ్,సెన్సస్ ట్రైనింగ్ డిసెంబర్ 2 వరకు వివిధ రోజులలో ఉంటే అవి చాలదన్నట్లు 21,28తేదీలలో కాంప్లెక్స్ సమావేశాలు షెడ్యూల్ ఇచ్చారన్నారు.విడ్డూరంగా పంచాయతీ ఎన్నికల 2వ ఫేజ్ ఉన్న 28వ తేదీ న కాంప్లెక్స్ సమావేశo పెట్టడం మరింత విడ్డూరం. సమగ్ర శిక్షభియాన్, అధికారులు సమన్వయం లేకుండా ఎన్నికల టైమ్ లో ట్రైనింగ్ షెడ్యూల్ ఇవ్వడం సరైనది కాదన్నారు. మరొక అధితిగా పాల్గొన్న ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బసవలింగారావు మాట్లాడుతూ అక్టోబర్ దసరా సెలవులు అనంతరం సైక్లోన్స్,ఎలక్షన్స్ ,సెన్సెస్, ఎఫ్ ఎల్ ఎన్,నిశిత ప్రశస్త తదితర ట్రైనింగ్ లతో పాఠశాలకు సరిగా జరగలేదన్నారు.దీనికంతటికి కారణం పాఠశాల విద్యను ప్రైవేటీకరణ కి దారితీయడమే పాలకుల విధానాలుగా ఉన్నాయన్నారు.2003 డీఎస్సీ ఉపాధ్యాయుల యొక్క సీపీఎస్ నుండి ఒపీఎస్ అమలు లో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగించి ఎస్ ఆర్ ఆధారంగా పనిచేస్తున్న జిల్లాలోనే అమలు చేయాలని అన్నారు.1.9.2004 ముందు నోటిఫికేషన్ ద్వారా ఆ తర్వాత జాయిన్ అయిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఒపీఎస్ అమలు చేయాలన్నారు.మున్సిపల్ ఉపాధ్యాయుల పీఎఫ్ సమస్య పరిష్కరించాలని కోరారు.ఈ సమావేశం లో ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలిద్,జిల్లా ఉపాధ్యక్షులు పి.నాగాశివన్నారాయణ,జిల్లా కార్యదర్శులు పి.లక్ష్మీనారాయణ,కిషోర్ షా, ఆడిట్ కమిటీ సభ్యులు సిద్దిక్ డి.రాజేంద్రప్రసాద్,జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
సూర్య నాయక్