ఉప్పలపాటి 'రూబీ జూబ్లీ వేడుకల లోగో,పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు, మేజర్‌న్యూస్ :
నాలుగు దశాబ్దాలుగా విద్యారంగానికి విశేష సేవలందిస్తూ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఉప్పలపాటి వెంకటేశ్వరరావు 40 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న 'రూబీ జూబ్లీ వేడుకల' లోగో, ఆహ్వాన పోస్టర్ ను గురువారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘనంగా ఆవిష్కరించారు. డిసెంబర్ 9వ తేదీన జరగనున్న ఈ వేడుకలకు సంబంధించిన ప్రచార సామగ్రిని ఆవిష్కరించి, ఉప్పలపాటి వెంకటేశ్వరరావుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.