BREAKING
ఉప్ప‌ల‌పాటి 'రూబీ జూబ్లీ వేడుకల లోగో,పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్రిమియా వంతెన దాడి తర్వాత నల్ల సముద్రం, ఇంధన కాల్పుల విరమణకు పుతిన్ తిరస్కరణ రష్యా ఇంధన దిగుమతులపై ఐరోపాకు ఆసక్తి లేదు ఇటలీలో హ్యాకర్ల బెదిరింపులు.. అస్థిరపరిచే యత్నమే కానీ ముప్పు లేదన్న మంత్రి కొలువుదీరిన మండల పరిషత్ పాలకవర్గాలు : నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి భారత్ జపాన్ రక్షణ బంధం మరింత పటిష్టం..ఇండో పసిఫిక్ భద్రతకు కొత్త ఊపు వత్సవాయి మండలంలో రెండో రోజు నామినేషన్ల జోరు.. సర్పంచ్‌కు 62, వార్డులకు 240 నామినేషన్లు! ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం అందించిన ప్రజా సేవకుడు మామిడి పూతదశ జాగ్రత్తల పై రైతులకు శిక్షణ చిత్తూరు రూరల్‌లో నూతన పాలన.. అధ్యక్షుడిగా జయచంద్ర నాయుడు, ఉపాధ్యక్షురాలిగా లావణ్య ఐఐటీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్ తొలి బ్యాచ్ పట్టభద్రం ఎంపీపీ తుపాకుల చిన్న శేషయ్య, ఉపాధ్యక్షురాలు చింతల సోనియాకు టీడీపీ ఆధ్వర్యంలో ఘన సన్మానం గజమాలలు, పూలమాలలు, శాలువాలతో సత్కారం. జల సంచయ్ జన భాగీదారి పురోగతిపై సమీక్ష ప్రమాణ స్వీకారం చేసిన సెట్టూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీల, ఎంపీటీసీలు. నేటి చిన్ని ఆలోచనలే రేపటి ఆవిష్కరణలకు పునాది : అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం : బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ విజేతలకు అభినందనలు

ఎంపీపీ తుపాకుల చిన్న శేషయ్య, ఉపాధ్యక్షురాలు చింతల సోనియాకు టీడీపీ ఆధ్వర్యంలో ఘన సన్మానం గజమాలలు, పూలమాలలు, శాలువాలతో సత్కారం.

Select Suryaa Now
ఎంపీపీ తుపాకుల చిన్న శేషయ్య, ఉపాధ్యక్షురాలు చింతల సోనియాకు టీడీపీ ఆధ్వర్యంలో ఘన సన్మానం  గజమాలలు, పూలమాలలు, శాలువాలతో సత్కారం.

చిట్టమూరు మేజర్ న్యూస్

చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తుపాకుల చిన్న శేషయ్య, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన చింతల సోనియాకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం టీడీపీ మండల కన్వీనర్ గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతనంగా ఎన్నికైన ఎంపీపీ తుపాకుల చిన్న శేషయ్య,ఉపాధ్యక్షురాలు చింతల సోనియాలకు పూలమాలలు, శాలువాలు, భారీ గజమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ శ్రేణుల నినాదాలతో మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులను ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా మండలంలోని ఎనిమిది ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ తరఫున ఎన్నికైన ఎంపీటీసీలను ఆయా సెగ్మెంట్ల పరిధిలోని స్థానిక నాయకులు ప్రత్యేకంగా పూలమాలలు, గజమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

*టీడీపీ తరఫున ఎంపీటీసీలుగా ఎన్నికైన వారు*

1. కనుబోయిన శేషమ్మ – బురదగాలి

2. కమతం చెంగయ్య – కోగిలి

3. కుదురు అమీరమ్మ – మల్లాం-1

4. చల్లా కిరణ్మయి – గుణపాడు

5. చింతల సోనియా – చిట్టమూరు

6. తుపాకుల చిన్న శేషయ్య – చిల్లమూరు

7. నల్లారెడ్డి మదాలస – అరవపాలెం

8. భట్టా రామయ్య – ఈశ్వరవాక

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు పెళ్లూరు సౌజన్య రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈశ్వరవాక శివకోటారెడ్డి, యూనిట్ ఇన్‌చార్జి మారం రెడ్డి జనార్దన్ రెడ్డి, నాయకులు వెదనపర్తి రాజగోపాల్ రెడ్డి, షేక్ రషీద్, గుండు బోయిన కస్తూరయ్య యాదవ్, నల్లారెడ్డి రాజేష్ రెడ్డి, దొడ్డగ వెంకటరమణయ్య, ఆరూరు గిరినాయుడు, నూతలపాటి మునిబాబు నాయుడు, బాబు నాయుడు, గోపాల్ నాయుడు, మేరి గల మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్