BREAKING
భారత్ జపాన్ రక్షణ బంధం మరింత పటిష్టం..ఇండో పసిఫిక్ భద్రతకు కొత్త ఊపు వత్సవాయి మండలంలో రెండో రోజు నామినేషన్ల జోరు.. సర్పంచ్‌కు 62, వార్డులకు 240 నామినేషన్లు! ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం అందించిన ప్రజా సేవకుడు మామిడి పూతదశ జాగ్రత్తల పై రైతులకు శిక్షణ చిత్తూరు రూరల్‌లో నూతన పాలన.. అధ్యక్షుడిగా జయచంద్ర నాయుడు, ఉపాధ్యక్షురాలిగా లావణ్య ఐఐటీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్ తొలి బ్యాచ్ పట్టభద్రం ఎంపీపీ తుపాకుల చిన్న శేషయ్య, ఉపాధ్యక్షురాలు చింతల సోనియాకు టీడీపీ ఆధ్వర్యంలో ఘన సన్మానం గజమాలలు, పూలమాలలు, శాలువాలతో సత్కారం. జల సంచయ్ జన భాగీదారి పురోగతిపై సమీక్ష ప్రమాణ స్వీకారం చేసిన సెట్టూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీల, ఎంపీటీసీలు. నేటి చిన్ని ఆలోచనలే రేపటి ఆవిష్కరణలకు పునాది : అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం : బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ విజేతలకు అభినందనలు అద్దంకి ఆర్డీఓ కేంద్రంలో 53 నామినేషన్లు.. సర్పంచ్ పదవికి 30, వార్డులకు 23 దాఖలు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ శ్రీలంక పార్లమెంట్‌లో తీర్మానంపై చర్చకు సిద్ధం శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు త్వరగా పూర్తి చేయాలి : నగర కమిషనర్ కందనెల్లి చెక్‌డ్యామ్ వద్ద పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్ చీపురుపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

నేటి చిన్ని ఆలోచనలే రేపటి ఆవిష్కరణలకు పునాది : అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం : బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ విజేతలకు అభినందనలు

Select Suryaa Now
నేటి చిన్ని ఆలోచనలే రేపటి ఆవిష్కరణలకు పునాది : అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం : బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ విజేతలకు అభినందనలు

మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రాజెక్టుల పోటీల్లో విజయం సాధించిన బాలశాస్త్రవేత్తలకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్-2026 విజేతలకు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం,ఏపీసీ డాక్టర్ అనురాధ అభినందనలు తెలిపారు.రాష్ట్రస్థాయి ప్రాజెక్టుల ప్రదర్శనలో విద్యార్థులు మరింత ప్రతిభ కనబరచాలని,అన్నమయ్య జిల్లా నుంచి అత్యధిక ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యేలా కృషి చేయాలని సూచించారు.నేటి చిన్నచిన్న ఆలోచనలే రేపటి గొప్ప ఆవిష్కరణలకు పునాదులని పేర్కొంటూ,విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం,సృజనాత్మకత,పరిశోధనా ఆసక్తిని పెంపొందించాలని తెలిపారు.వైజ్ఞానిక రంగ అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలకు అవసరమైన సహాయ,సహకారాలు అందిస్తున్నాయని వివరించారు.అనంతరం విజేతలైన బాలశాస్త్రవేత్తలకు సర్టిఫికెట్లు,మెమెంటోలు అందజేశారు.రాష్ట్రస్థాయి బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ పోటీలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ ఎం.భాస్కరన్,సైన్స్ అధికారి శ్రీధర్,అకడమిక్ కో-ఆర్డినేటర్ పి.ఎల్.ఎన్ శాస్త్రి,రిసోర్స్ పర్సన్లు,గైడ్ టీచర్లు,బాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి