ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 03:09 PM
మెదక్ జిల్లాలో సోమవారం అక్రమంగా యూరియాను తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణమూర్తి సిబ్బందితో కలిసి 161 నంబర్ నేషనల్ హైవేపై టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి చౌరస్తా వద్ద ఈ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో 250 యూరియా బస్తాలు లభించాయి. వాహనాన్ని టేక్మాల్ పీఎస్కు తరలించి కేసు నమోదు చేశారు. యూరియా ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎవరు తరలిస్తున్నారనే దానిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.