ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 03:26 PM
హనుమకొండ: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్ , కేటీఆర్‌కు లేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసిందే భారత రాష్ట్ర సమితి అని విమర్శించారు. వారి పదేళ్ల పాలనలో పార్టీలు, ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఉపఎన్నికలు నిర్ణయించేది కేటీఆర్ కాదని.. ఎలక్షన్ కమిషన్ అని చురకలు అంటించారు.