![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 08:09 PM
TG: నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ తెలంగాణ అని CM రేవంత్ కొనియాడారు. 'ఎంతో మంది యోధులు TG కోసం ఉద్యమించారు. విద్యార్థుల, ప్రజల ఉద్యమ ఫలితమే తెలంగాణ. ఉద్యమ స్పూర్తితో వెళ్లాల్సిన తెలంగాణ డ్రగ్స్ బారిన పడటం బాధాకరం. యుద్ధవీరులకు నిలయమైన పంజాబ్‌లో డ్రగ్స్ కేసులు పెరిగిపోయాయి. డ్రగ్స్ అమ్మితే వెన్ను విరిచేస్తామని ముందే హెచ్చరించాం. మన దేశాన్ని విచ్చిన్నం చేయడానికి శత్రువులు డ్రగ్స్‌ను ప్రయోగిస్తారు' అని వ్యాఖ్యానించారు.తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఇకపై 'ఈగల్' (EAGLE - Elite Action Group for Drug Law Enforcement)గా పిలవనున్నారు. గ్రద్దలా పైనుంచి టార్గెట్‌పై దూకేలా డ్రగ్ మాఫియాపై ఈగల్ గట్టి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షించేందుకు ఈగల్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం ప్రకటించారు.