![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 08:36 PM
హైదరాబాద్ జీడిమెట్లలో దారుణ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కన్నకూతురే ప్రియుడితో కలిసి తల్లిని కిరాతకంగా హత్య చేసింది. తల్లి తమ ప్రేమకు అడ్డొస్తుందని భావించిన పదో తరగతి చదువుతున్న బాలిక (16) ప్రియుడు, ఆమె సోదరుడితో కలిసి ఆమెను దారుణంగా హతమార్చింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలి అక్క కీలక విషయాలు వెల్లడించారు. ఐదు రోజుల క్రితమే బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఆ సమయంలో కేసు నమోదైనట్లు చెప్పింది. హత్యకు సంబంధించిన వివరాలు ఆమె మాటల్లోనే..
'నా చెల్లి అంజలి షాపూర్ కళావతి నగర్‌లో గత 15 ఏళ్లుగా ఉంటోంది. కళా సారథిలో జాబ్ చేస్తుంది. చాకలి ఐలమ్మ మునిమనమరాలు. నా చెల్లి అందరితో మంచిగ ఉంటుది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్దమ్మాయి పదో తరగతి చదువుతోంది. ఇటీవల ఇన్‌స్ట్రాలో నల్గొండకు చెందిన శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నట్లు తెలిసింది. చదువుకునే వయసులో ప్రేమ వద్దని నా చెల్లి చెప్పింది. దీంతో పెద్దమ్మాయి తల్లిపై కోపం పెంచుకుంది. ఐదు రోజుల క్రితం ఇంట్లో నుంచి శివతో కలిసి పారిపోయింది. పోలీసులు ఇద్దరిని పట్టుకొచ్చిన్రు. అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిన్రు. వాడ్ని స్టేషన్‌లోనే ఉంచమని మేం కోరాం. కానీ పోలీసులు ఆ తర్వాత వాడ్ని విడిచిపెట్టినట్లు తెలిసింది. నిన్న సాయంత్రం శివకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. దీంతో వాడు నల్గొండ నుంచి వచ్చిండు. ఆ తర్వాత ఇవాళ ఉదయం ఉంట్లో అంజలి పూజ చేస్తుండటాన్ని అదునుగా చూసి వాడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. పూజ చేస్తున్న సమయంలోనే బిడ్డ చున్నీతోనే తలకు చుట్టి గుద్దిన్రు. ఆ తర్వాత అక్కడి నుంచి వాడు వెళ్లిపోయిండు. కొన ఊపిరితోనే నా చెల్లె కొట్టుకుంటుంటే.. వాడ్ని మళ్లీ పిలలిచిందంట. మా అమ్మ చచ్చిపోలేదు.. వచ్చి చంపేయ్ ఆ తర్వాత మనం వెళ్లిపోదాం అని పిలిచిందట.
ఆ తర్వాత వాడు మళ్లీ వచ్చి సుత్తెతోని ముక్కు, తల మీద గట్టిగా కొట్టిండు. వాని తమ్ముడు గొంతు కోసి అక్కడి నుంచి వెళ్లిపోయిన్రు. నా చిన్న బిడ్డను బయటకు పంపించి ఈ దారుణానికి పాల్పడ్డరు. 8 నెలల నుంచి ప్లాన్ చేసిందట. మాకు న్యాయం చేయాలి.' అంటూ అంజలి అక్క రోధించారు. కాగా, హత్యకు పాల్పడిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇద్దరు యువకులు పరారీలో ఉండగా.. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది.