|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 03:43 PM
రంగారెడ్డి షాద్‌నగర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లో ఓ కార్మికుడు రైల్వే లైన్ దాటుతుండగా నిలిచిన గూడ్స్ ట్రైన్ అకస్మాత్తుగా కదలడంతో లైన్‌పై పడుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే.... తిమ్మాపూర్ పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో బీహార్ కు చెందిన వ్యక్తి పనిచేస్తున్నాడు. నిత్యం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పైనుంచి రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం కంపెనీలో విధులు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు ఇదివరకు కూడా రెండు మూడు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాదచారుల కోసం సమీపంలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ చాలామంది పట్టాలు క్రాస్ చేసి వెళుతుంటారు. ఇది ప్రమాదకరమని, పట్టాలు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.