|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 08:08 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతులను అరిగోస పెడుతోందని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. సన్న వడ్లకు బోనస్ రూ.512 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. '4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోజుల తరబడి పెండింగ్‌లో ఉంది. ఈ యాసంగికి 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పింది కానీ, 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాటలేదు. కొన్న వడ్లకు రూ.4 వేల కోట్లు బకాయి పడింది' అని ఫైర్ అయ్యారు.వానకాలం రైతు బంధు ఎగ్గొట్టారని, యాసంగి రైతుబంధు 3 ఎకరాలకు మించి వేయలేదని BRS నేత హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 'వరి కొనుగోలు కేంద్రాల్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. లారీలు లేక కొన్న లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులోకి పోకుండా మిగిలిపోయింది. పెట్టుబడి సాయం కోసం రూ.18 వేల కోట్లు బడ్జెట్లో పెట్టామని భట్టి గారు చెప్తున్నారు. కోతలు అయిపోయినా యాసంగి పెట్టుబడి సాయం ఇంకా వెయ్యలేదు' అని విమర్శించారు.పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్యే హరీశ్ రావు. అలాంటి వార్తలను ఇదివరకే ఖండించానని స్పష్టం చేసిన హరీశ్. కేసీఆర్ మా పార్టీ అధ్యక్షుడు.. ఆయన చెప్పింది తు.చ. తప్పకుండా పాటిస్తానని వెల్లడి.