విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
తుర్కయంజాల్, మేజర్ న్యూస్.
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.విద్యుత్ షాక్‌కు గురై 26 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం కాట్రావత్ తండాకు చెందిన కాట్రావత్ రాజేష్ నాయక్ ఉపాధి నిమిత్తం బ్రాహ్మణపల్లిలోని పరిణయ గార్డెన్‌లో ఫ్రూట్స్ స్టాల్‌లో పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.వెంటనే చికిత్స నిమిత్తం తారా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.మృతుడికి భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నట్లు సమాచారం.మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పరిణయ గార్డెన్ ముందు పెద్ద ఎత్తునా ఆందోళ చేపట్టారు.
ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్, రంగారెడ్డి జిల్లా.