BREAKING
విజయవాడలో కాస్మో వాహన రక్షణ సేవల విస్తరణ పటమట నారాయణ ఈ-చాంప్స్‌లో ఎన్‌పీఎల్ ఫైనల్స్ భక్త కనకదాస జీవితం ఆదర్శనీయం: కలెక్టర్ తోట్లవల్లూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ కృష్ణా జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ రెండో దశ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రచారం పెద్దపులిపాకలో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం సీసీ కెమెరాలతో 30 నిమిషాల్లో ఆటో గుర్తింపు.. పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.లక్ష విరాళం సమర్పణ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస ప్రత్యేక పూజలు ఎన్నికల సామగ్రి భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : కమిషనర్ ధ్యానచంద్ర ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వ్యాధులను నివారించాలి విజయవాడ మెట్రోకు పటిష్ట హెచ్‌ఆర్ ప్రణాళిక

పటమట నారాయణ ఈ-చాంప్స్‌లో ఎన్‌పీఎల్ ఫైనల్స్

Select Suryaa Now
పటమట నారాయణ ఈ-చాంప్స్‌లో ఎన్‌పీఎల్ ఫైనల్స్

విజయవాడ, మేజర్ న్యూస్: పటమటలోని నారాయణ ఈ-చాంప్స్ పాఠశాలలో ఎన్‌పీఎల్ (NPL) క్రీడా లీగ్ ఫైనల్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం క్రీడా సందడితో ఉత్సాహభరితంగా మారింది. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే మనస్తత్వం పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఫైనల్స్‌లో చిన్నారుల ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఏజీఎం బి.ముత్తారెడ్డి, ప్రిన్సిపాల్ వెంకట రమణ, కోఆర్డినేటర్ జహూర్ ఫాతిమా, వైస్ ప్రిన్సిపాల్ శివ పార్వతి, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.