BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

పెద్దపులిపాకలో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
పెద్దపులిపాకలో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం

పెనమలూరు, మేజర్ న్యూస్: పెనమలూరు మండలం పెద్దపులిపాక గ్రామ పంచాయతీలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముసునూరు శ్రీధర్‌తో పాటు అన్ని వార్డుల కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను, స్థానిక నాయకులను, కూటమి కార్యకర్తలను కలుసుకుంటూ సర్పంచ్ అభ్యర్థి శ్రీధర్‌తో పాటు అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు తమ విలువైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు నిరంతరంగా కొనసాగాలంటే గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులుగా కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందాలని పేర్కొన్నారు. పెద్దపులిపాక గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.