మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి
పరకాల, మేజర్ న్యూస్, పరకాల పట్టణానికి చెందిన నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ఆలేటి శ్రీనివాస్ అనారోగ్య కారణంతో అకాల మరణం చెందారు. వారి ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా శనివారం స్థానిక తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి బియ్యం, నిత్యవసర సరుకులు అందించి భరోసాగా నిలిచారు. కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.
రిపోర్టర్: పురుషోత్తం, పరకాల, హనుమకొండ జిల్లా