స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో
పరకాల, మేజర్ న్యూస్, పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న శనివారం పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర)లో నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఫారం-18 ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్ల నమోదు ప్రక్రియను పరిశీలించి, అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.అలాగే, ఈ నెల 29, డిసెంబర్ 5, 6 తేదీలలో నిర్వహించనున్న స్పెషల్ క్యాంపెయిన్ డేస్‌ను అర్హులైన పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫారం-18 ద్వారా కొత్తగా పేర్ల నమోదు చేసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలో ఇప్పటికే నమోదైన వివరాల్లో ఏవైనా తప్పులు లేదా పొరపాట్లు ఉన్నట్లయితే వాటి సవరణల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.కార్యక్రమంలో పరకాల డిప్యూటీ తహసీల్దార్ అశోక్, రెవెన్యూ సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
రిపోర్టర్ :పురుషోత్తం, పరకాల, హనుమకొండ జిల్లా