BREAKING
గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష

వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల

Select Suryaa Now
వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల

హనుమకొండ ,మేజర్ న్యూస్, విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వికసిత భారత్–2047 లక్ష్య సాధనలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్, కాకతీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్ల తెలిపారు. విద్య కేవలం డిగ్రీలు పొందేందుకు మాత్రమే కాకుండా, సమాజంలో సానుకూల మార్పు తీసుకొచ్చే బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దేందుకు దోహదపడాలని ఆయన అన్నారు.శనివారం హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగిన విశ్వ విద్యాలయం 24వ స్నాతకోత్సవంలో  గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాకతీయ విశ్వ విద్యాలయం 50 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని, స్వర్ణోత్సవ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ స్నాతకోత్సవం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని గవర్నర్ పేర్కొన్నారు. 1976 ఆగస్టు 19న స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం తెలంగాణలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలను అందిస్తూ, అనేక కుటుంబాల్లో తొలి తరం పట్టభద్రులను తయారు చేసిందన్నారు. మహిళలకు విద్య, ఉద్యోగ, నాయకత్వ అవకాశాలను విస్తరించడంలోనూ విశ్వవిద్యాలయం విశేష పాత్ర పోషించిందని కొనియాడారు.
2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో పట్టాలు పొందిన విద్యార్థులకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా పీహెచ్‌డీ పట్టాలు అందుకున్న పరిశోధకులు, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 
విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధనా మార్గదర్శకుల ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం 2023లో ఎన్ఏఏసి  ఏ+ గ్రేడ్ సాధించడం విశ్వవిద్యాలయ సమష్టి కృషికి నిదర్శనమని గవర్నర్ తెలిపారు. నాణ్యమైన బోధన, నిబద్ధతతో కూడిన పరిశోధన, సమర్థవంతమైన పరిపాలన, విద్యార్థుల అవసరాలపై ప్రత్యేక శ్రద్ధతో విద్యా ప్రమాణాలను నిరంతరం మెరుగుపరచాలని సూచించారు. 
విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ సేవా పథకం, జాతీయ క్యాడెట్ కార్ప్స్  ద్వారా క్రమశిక్షణ, జట్టు టీమ్ స్పిరిట్, సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.  పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచి, మెంటరింగ్, సహకారం అందించాలని కోరారు.జాతీయ విద్యా విధానం–2020 విద్యను మరింత సమగ్రంగా, సౌకర్యవంతంగా, సమాజ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీలు, నైపుణ్యాభివృద్ధి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులకు ఆధునిక ప్రయోగశాలలు,  గ్రంథాలయాలు, ప్రాక్టికల్ లెర్నింగ్, పరిశోధనా అవకాశాలు అందుబాటులో ఉండాలని అన్నారు. విద్యలో నాణ్యతతో పాటు సమాన అవకాశాలు, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు జీవితాంతం నేర్చుకునే అలవాటును పెంపొందించుకోవాలని గవర్నర్ సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలు సమాచార విశ్లేషణ, సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతున్నప్పటికీ, నిర్ణయాల బాధ్యత మానవులదేనని స్పష్టం చేశారు. సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవాలని, తప్పుడు సమాచారాన్ని గుర్తించి ప్రశ్నించే వివేకాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.
యువతను మాదకద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి రక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందుకుసాగుతుందన్నారు. 34  పైగా దేశాలు దేశ ప్రధానిని తమ దేశ అత్యున్నత పౌర పురస్కాలతో గౌరవించాయని చెప్పారు. యువత నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నషాముక్త భారత్ లక్ష్యాన్ని దేశం ముందుంచారని, 2029 నాటికి మాదకద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పానికి యువత తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలని సూచించారు. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,  ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన నషాముక్త భారత్ కార్యక్రమం ఈ దిశగా మంచి ప్రయత్నమని పేర్కొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కూడా విద్యార్థులు, యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కోరారు. ఔషధ పరిశోధన, మెటీరియల్స్, ఔషధ మొక్కలు, డిజిటల్ వ్యవస్థలు వంటి రంగాల్లో పరిశోధనలు సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను అందించగలవన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, నీరు, ఇంధనం, సాంకేతికతతో పాటు విద్య, చరిత్ర, భాష, న్యాయం, ప్రజా విధానాలు, సామాజిక మార్పులపై కూడా పరిశోధనలు జరగాలని తెలిపారు. విద్య, ఉపాధి మధ్య సమన్వయం పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్య కార్యక్రమాలు యువతకు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల కళాశాలల విద్యార్థులకు కూడా డిజిటల్ వనరులు, మెంటర్లు, ప్రాక్టికల్ లెర్నింగ్ అవకాశాలు అందుబాటులో ఉండాలని గవర్నర్ సూచించారు. మంచి ఆలోచన ఎక్కడి నుంచైనా రావచ్చని, వాటిని గుర్తించి ప్రోత్సహించే వ్యవస్థలు విశ్వ విద్యాలయాల్లో ఉండాలని అన్నారు. విశ్వ విద్యాలయాలు, ప్రభుత్వం, పరిశ్రమలు, పూర్వ విద్యార్థులు సమన్వయంతో పనిచేస్తే తెలంగాణ అభివృద్ధితో పాటు దేశ ప్రగతికి మరింత బలమైన తోడ్పాటు అందించగలరని పేర్కొన్నారు.
కాకతీయ ప్రాంత చారిత్రక వారసత్వం సృజనాత్మకత, ప్రజాసంక్షేమం, సామాజిక ఐక్యతకు ప్రేరణనిస్తుందని గవర్నర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ Rising రైజింగ్ తెలంగాణ  దార్శనికత, కేంద్ర ప్రభుత్వ Viksit వికసిత్ భారత్ 2047 సంకల్పం అవకాశాలను విస్తరించడం, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడం, సమృద్ధి భవిష్యత్తును నిర్మించడం అనే ఉమ్మడి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. బలమైన తెలంగాణ వికసిత భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.పీహెచ్‌డీ పరిశోధకులు పరిశోధనలో వాస్తవాలు, ఆధారాలకు ప్రాధాన్యతనిస్తూ అకడమిక్ నైతికతను పాటించాలని, తమ పరిశోధన సమాజానికి ఉపయోగపడేలా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు తమ విజయాన్ని ఇతరులకు స్ఫూర్తిగా నిలిపి, వినయంతో జ్ఞానాన్ని పంచుకోవాలని అన్నారు. పట్టభద్రులు తమ ప్రతిభను కేవలం పతకాలు, ఉద్యోగాల ద్వారా కాకుండా, సమాజానికి అందించే సేవ, వ్యక్తిత్వం, నిరంతర అభ్యాసం ద్వారా కూడా నిరూపించుకోవాలని పేర్కొన్నారు.
విద్యార్థులు ఎక్కడికి వెళ్లినా కాకతీయ విశ్వవిద్యాలయ విలువలు, వారసత్వాన్ని తమతో తీసుకెళ్లాలని, కష్టపడి పనిచేయడం, నిజాయితీ, ఇతరుల పట్ల సానుభూతి, బాధ్యతాయుత ప్రవర్తనను జీవితంలో భాగంగా చేసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విజయాలతో పాటు సవాళ్లు ఎదురైనప్పుడు తమ విలువలపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని సూచించారు.
కాకతీయ విశ్వవిద్యాలయం బోధన, పరిశోధన, ఆవిష్కరణలు, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, పట్టభద్రులు, పీహెచ్‌డీ పరిశోధకులు, బంగారు పతక విజేతలకు గవర్నర్ మరోసారి అభినందనలు తెలిపారు. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.
పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి స్నాతకోత్సవ సందేశం ఇచ్చారు.
విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి కేయూ చేపట్టిన విద్యా సంబంధిత కార్యక్రమాలు, పురోగతిని వివరించారు.ఈ సందర్భంగా పట్టభద్రులకు గవర్నర్ డిగ్రీలను ప్రదానం చేశారు.అంతకుముందు కేయూ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, సిపి శ్వేత, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, కేయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కే ప్రతాప్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. 
నీట్  వీఐపీ గెస్ట్ హౌస్ వద్ద పోలీసుల గౌరవ వందనం గవర్నర్ స్వీకరించారు.

రిపోర్టర్; పురుషోత్తం, హనుమకొండ, హనుమకొండ జిల్లా