BREAKING
*ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ ఆలయ వార్షిక మహోత్సవం దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతపు నష్టాలు.. ఆఖరి రోజు అమ్మకాల ఒత్తిడితో కుదేలైన సూచీలు! అండర్  గ్రౌండ్ డ్రైనేజీ  పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండి సేవ చేయాలి

ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష

Select Suryaa Now
ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;;కామారెడ్డి జిల్లాలో వానాకాలం 2026-27 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకుఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను సకాలంలో పూర్తిచేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత కేటాయింపు పొందిన బియ్యం మిల్లులకు లేదా గోదాములకు మాత్రమే రవాణా చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు  కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, పౌర సరఫరాల అధికారివెంకటేశ్వర్, జిల్లా సహకార మార్కెటింగ్ శాఖ శ్రీకాంత్ మేనేజర్, జిల్లా వ్యవసాయ అధికారి మ్మోహన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దామోదరెడ్డి, జిల్లా సహకార అధికారి,రామ్మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారిరమ్య, సంబంధిత గోదాం నిర్వాహకులు తదితర అధికారులు పాల్గొన్నారు.