సూర్య ఎల్లారెడ్డి ;;; ఎల్లారెడ్డి మున్సిపల్ లోని పదవ వార్డులో కొనసాగుతున్న 10 లక్షల తో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల ను శని వారం మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో ఎల్లారెడ్డి మున్సిపల్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అలాగే ఇప్పుడు పదవ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కొనసాగుతుందని అన్నారు.ఇట్టి పనులకు వార్డు ప్రజలంతా సహకరించాలని కోరారు సదర్ కాంట్రాక్టర్ ను నిర్మాణ పనులలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతతో కూడుకున్న పనులు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జే జగ్జీవన్, వార్డు ప్రజలు పాల్గొన్నారు