కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు!
సిద్దిపేట అర్బన్, మేజర్ న్యూస్ :తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ గతిని మలుపు తిప్పిన చారిత్రక ఘట్టమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన ఉండేది కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే రేవంత్‌రెడ్డి చంద్రబాబు అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగేవారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆదివారం దీక్షా దివస్ సందర్భంగా సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్దిపేట గడ్డ నుంచే ఉద్యమ శంఖారావం
తెలంగాణ ఉద్యమానికి, సిద్దిపేటకు విడదీయలేని అనుబంధం ఉందని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన సైతం సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన సమావేశంలోనే వెలువడిందని గుర్తుచేశారు. 'కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో' అనే నినాదం సిద్దిపేట గడ్డ నుంచే పుట్టిందన్నారు. రంగనాయకులపల్లి చౌరస్తాలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసిన సమయంలో పోలీసులు అడ్డంకులు సృష్టించినా, చలిని సైతం లెక్కచేయకుండా కార్యకర్తలు రాత్రింబవళ్లు శిబిరానికి కాపలా కాశారని పేర్కొన్నారు. ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో సైనికులేనని కొనియాడారు.
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రక్రియకు శ్రీకారం
నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష అనంతరం డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గడంతో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైందన్నారు. కేసీఆర్ జేఏసీని ఏర్పాటు చేసి రాజకీయ శక్తులను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని, చివరకు పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా పోరాటం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎందరో అమరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటం, కేసీఆర్ నాయకత్వ ఫలితమని అన్నారు.
రేవంత్ పాలనపై విమర్శల వర్షం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అమలైన అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని హరీశ్‌రావు ఆరోపించారు. రైతుబీమా, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, న్యూట్రిషన్ కిట్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
నాగార్జునసాగర్‌పై ఆందోళన
నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం, దుస్తులు, కోడిగుడ్ల సరఫరాలోనూ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు.
సిద్దిపేట సభకు రూ.50 కోట్లు ఖర్చు.. సిద్దిపేటకు ఏం ఇచ్చారు?
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా 26 నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించి సభ నిర్వహించారని హరీశ్‌రావు విమర్శించారు. బస్సులు, సభ ఏర్పాట్లకు రూ.50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపిస్తూ, సిద్దిపేట అభివృద్ధికి కనీసం 50 పైసలైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. భారీ ఏర్పాట్లు, ప్రచార ఆర్భాటాలు తప్ప సిద్దిపేట ప్రజలకు ఏమి ప్రయోజనం కల్పించారని నిలదీశారు.
సిద్దిపేట అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర సాధనే పునాది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే సిద్దిపేట జిల్లాగా మారేదా? రైలు వచ్చేదా? గోదావరి జలాలు చేరేవా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు సిద్దిపేటకు రైలు, సాగునీరు కలగానే మిగిలాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆ కలలు సాకారమయ్యాయని అన్నారు. సిద్దిపేటలో 1,531 రోజుల పాటు నిరాహార దీక్షా శిబిరం కొనసాగిందని, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సైతం ఇక్కడికి వచ్చి ఉద్యమకారుల అభిప్రాయాలు తెలుసుకుందని గుర్తుచేశారు.
ఉద్యమకారుల త్యాగాలను మరువొద్దు
తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు, లాఠీ దెబ్బలు, నిర్బంధాలు ఎదుర్కొన్నా ఉద్యమకారులు వెనుకడుగు వేయలేదని హరీశ్‌రావు అన్నారు. సాగరహారం వంటి కార్యక్రమాల్లో సిద్దిపేట ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో ప్రజలకు వాస్తవాలను తెలియజేయడంలో పాత్రికేయులు కూడా కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. అమరుల త్యాగాలను, ఉద్యమకారుల పోరాటాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
డిసెంబర్ 9 విజయ దివస్‌గా జరుపుకోవాలి
నవంబర్ 29ను దీక్షా దివస్‌గా జరుపుకుంటున్న తరహాలోనే డిసెంబర్ 9ను విజయ దివస్‌గా నిర్వహించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. 1956లో విశాలాంధ్ర విలీనాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటం నుంచి 1969 ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని పేర్కొన్నారు. నేటి యువతకు తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియజేయాలని, ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిస్తూ జై తెలంగాణ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు.కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు!
నవంబర్ 29 లేకపోతే తెలంగాణ లేదు.. తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా?
సిద్దిపేట దీక్షా దివస్ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
సిద్దిపేట అర్బన్, మేజర్ న్యూస్ :
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ గతిని మలుపు తిప్పిన చారిత్రక ఘట్టమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన ఉండేది కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే రేవంత్‌రెడ్డి చంద్రబాబు అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగేవారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

నవంబర్ 29ను దీక్షా దివస్‌గా జరుపుకుంటున్న తరహాలోనే డిసెంబర్ 9ను విజయ దివస్‌గా నిర్వహించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. 1956లో విశాలాంధ్ర విలీనాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటం నుంచి 1969 ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని పేర్కొన్నారు. నేటి యువతకు తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియజేయాలని, ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిస్తూ జై తెలంగాణ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు.