కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ..
దుబ్బాక మేజర్ న్యూస్…తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి (టీఆర్‌ఆర్‌ఎస్) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 4వ మహాసభ పోస్టర్‌ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో జరిగే మహాసభకు హాజరుకావాలని కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషనర్ బక్కీ వెంకటయ్యను తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ చిన్నరంగారి, జిల్లా అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య ఎమ్మెల్యేను ఆహ్వానించారు. రజకుల ఐక్యత, హక్కుల సాధన, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా మహాసభ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మహాసభకు రజక కులబాంధవులు, సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య కోరారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల అధ్యక్షుడు సత్యం, దుబ్బాక పట్టణ అధ్యక్షుడు స్వామి, హరీష్ లు పాల్గొన్నారు.