లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం
మద్దూరు మేజర్ న్యూస్....…మద్దూరు మండల కేంద్రంతో పాటు మండలంలోని రేబర్తి గ్రామాలలో లక్షలు వెచ్చించి నిర్మించిన హెల్త్ సెంటర్ భవనాలు నేటికీ ప్రారంభానికి నోచుకోని నిర్లక్ష్యపు నీడలో దర్శనమిస్తున్నాయి. ఒక్కో భవనానికి సుమారు 20 లక్షల ఖర్చుతో నిర్మాణాలు చేపట్టి గాలికి వదిలేశారు. ఇన్ని లక్షలు ఖర్చు చేసి పల్లె దవాఖానాల భవనాలు ప్రజలకు అందుబాటులోకి ఎందుకు తీసుకురావడం లేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిర్మించిన భవనాలకు బిగించిన విండోస్ అద్దాలు పగిలిపోయి శిథిలావస్థకు చేరుతున్నాయి. నిర్మించి సంవత్సరాలు గడుస్తున్న అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో గ్రామాలలో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామాలలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసినప్పటికీ భవనాలు అసంపూర్తిగా పూర్తిచేసి గాలికి వదిలేసారు. పక్కా భవనాలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక భవనాల్లో వైద్య సేవలను అందిస్తున్నప్పటికీ ఇటు పక్కా భవనాలు లేక తాత్కాలిక భవనాలకు వైద్యులు లేక గ్రామాలలో వైద్య సేవలు కుంటుపడుతున్నాయని ప్రజలకు వైద్య సేవలు అందించే నాధులే కరువయ్యారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య చికిత్సల కోసం మండల కేంద్రంతో పాటు మండలంలోని లద్నూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకోవాలంటే రవాణా సౌకర్యం సరిగా లేక మద్దూరు, దూల్మిట్ట మండలాలలోని మారుమూల గ్రామాల నుండి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో నిర్మించిన హెల్త్ సెంటర్ పక్కా భవనాలను పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకొని హెల్త్ సెంటర్ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పక్కా భవనాలు ఉన్న పల్లె దవాఖానాలకు వైద్యులను నియమించాలని వివిధ గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.