BREAKING
కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు!

Select Suryaa Now
ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు!

చిన్నకోడూరు/మేజర్ న్యూస్:
చిరువ్యాపారులకు ఆర్థిక చేయూత అందించాల్సిన బ్యాంకులే రుణ వసూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే ఆరోపణలు చిన్నకోడూరులో కలకలం రేపుతున్నాయి.చిన్నకోడూరులోని యూనియన్ బ్యాంకులో ముద్ర పథకం కింద రూ.2 లక్షల రుణం తీసుకున్న ఓ చిరువ్యాపారి ప్రస్తుతం బ్యాంకు వసూళ్ల ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నాడు.వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో నెలవారీ రుణ వాయిదాలు చెల్లించడం భారంగా మారిందని బాధితుడు తెలిపాడు.ఇప్పటివరకు తన సేవింగ్స్ ఖాతా నుంచి ప్రతి నెల రూ.2 వేల చొప్పున ఆటో డెబిట్ అవుతుండగా, నగదు రూపంలోనూ సుమారు రూ.లక్ష చెల్లించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నెలవారీ వాయిదా తగ్గించి చెల్లించేందుకు అవకాశం కల్పించాలని బ్యాంకు అధికారులను కోరినా స్పందన లేదని ఆరోపించాడు.ప్రతి నెలా రూ.4,300 తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు వాపోయాడు.రుణ వాయిదాల కోసం తరచూ ఫోన్లు చేయడమే కాకుండా, సెలవు రోజుల్లోనూ ఫోన్లు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు.అంతటితో ఆగకుండా రాత్రి వేళల్లో కొందరు బ్యాంకు సిబ్బంది మద్యం సేవించి తన దుకాణం వద్దకు వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు చేశాడు.రుణం తీసుకున్న చిరువ్యాపారి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని నిబంధనల ప్రకారం పరిష్కారం చూపాల్సిన బ్యాంకు సిబ్బంది,ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.రుణ వసూళ్ల పేరుతో రాత్రివేళల్లో దుకాణాల వద్దకు వెళ్లి ఒత్తిడి చేయడం, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముద్ర పథకం ఉద్దేశం చిరువ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలవడమే..అలాంటి పథకం కింద రుణం తీసుకున్న వ్యాపారికి ఎదురవుతున్న ఇబ్బందులపై బ్యాంకు ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాత్రివేళల్లో సిబ్బంది దుకాణం వద్దకు వచ్చిన ఘటనపై విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.