BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

Select Suryaa Now
మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

మచిలీపట్నం, మేజర్ న్యూస్ : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అర్హులైన ఉద్యోగులకు మరో అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లా పరిధిలో ఆదివారం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలను సోమవారం (నవంబర్ 30) కూడా కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొన్న కారణంగా ఆదివారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోలేకపోయిన అర్హులైన ఉద్యోగుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన ఉద్యోగులు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలను సందర్శించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ సమాచారాన్ని అర్హులైన ఉద్యోగులందరికీ తెలియజేసి, కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.