రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా
తిరుపతి రూరల్,
మేజర్ న్యూస్:
తిరుపతి రూరల్ మండలం రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా 89 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదివారం గ్రామ సచివాలయంలో ఓట్ల లెక్కింపు అనంతరం సర్పంచుగా పొట్టేలి సుధా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి డిక్లరేషన్ పత్రాన్ని సర్పంచ్ కు అందజేశారు. అనంతరం గెలుపొందిన
వార్డు సభ్యులందరూ చేతులెత్తి ఉపసర్పంచ్ గా ఉషా ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్పంచ్ పొట్టేలి సుధా భర్త టి మునిశేఖర్ రెడ్డి, సర్పంచు మరిది టి సోమశేఖర్ రెడ్డి గ్రామంలోని యువత పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ సుధా, భర్త మునిశేఖర్ రెడ్డి, టి సోమశేఖర్ రెడ్డిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్
టీ మునిరెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ భర్త పొట్టేలి రవికుమార్, పొట్టేలి మునిరత్నం, ఎమ్. మోహన్ రెడ్డి, ఎన్ ముని రెడ్డి, పి ముని కృష్ణారెడ్డి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో సర్పంచ్ పొట్టేలి సుధా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, గ్రామంలో అండర్ డ్రైనేజ్ సిస్టం తీసుకొస్తామని చెప్పారు. వీధిలైట్లు మరమ్మత్తులు చేయించడం, కొత్త లైట్లు అవసరమైన చోట వెంటనే అమరచడం, తాగునీటి సమస్యలు లేకుండా కొత్తగా బోర్లు వేయించేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళతానని పేర్కొన్నారు. తాను విజయం సాధించడానికి సహకరించిన గ్రామంలోని పెద్దలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
H. Dwaraka, staff reporter
9705347341.