BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

Select Suryaa Now
విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ఉయ్యూరు, మేజర్ న్యూస్: దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థుల చదువుకు ప్రయాణం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బి. రాజేంద్రప్రసాద్ అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు ఎస్‌బీఐ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ సైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎస్‌బీఐ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, మరింత మంది విద్యార్థులకు ఇటువంటి సహాయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సైకిళ్లను అందించిన ఎస్‌బీఐ ప్రాంతీయ మేనేజర్ సుకుమార్‌ను, నూతనంగా మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్‌ను ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణికుమార్, డాక్టర్ ద్విజేంద్రబాబు, డాక్టర్ చంద్రమోహన్, ఎస్‌బీఐ శాఖ మేనేజర్ కె.వి. రమణారావు, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు, కౌన్సిలర్ రామనోళ్ల శ్రీకాంత్, గఫర్, పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆరేపల్లి శివసాయి, జంపాన తేజ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.