BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు

Select Suryaa Now
మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు


మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : తిరుపతిలో ఆదివారం మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడి రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి విద్యా,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో మంత్రిని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు,మదనపల్లి మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.ఇందులో భాగంగా మంత్రి చినబాబుని ఆప్యాయంగా పలకరించారు.మదనపల్లి మునిసిపల్ ఛైర్మనుగా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయానికి చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధిలో మంత్రి లోకేష్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.ఆయన స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితమవుతామని స్పష్టం చేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి