BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

Select Suryaa Now
భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో విజయవాడ ఇంద్రకీలాద్రి మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ నెలకు సంబంధించి విడుదలైన ఐవీఆర్ఎస్ నివేదికలో దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి 76.6 శాతం మంది భక్తులు సానుకూల స్పందన తెలియజేశారు. దీంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్రథమ స్థానాన్ని సాధించగా, ఈ ఏడాది వరుసగా ఐదోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. అక్టోబర్ నెలలో 73.2 శాతంగా ఉన్న సంతృప్తి స్థాయి నవంబర్‌లో మరో 3.4 శాతం పెరిగి 76.6 శాతానికి చేరుకుంది. దర్శనం, తాగునీటి సౌకర్యాలు, ప్రసాదాల నాణ్యత, ఆలయ పరిసరాల పరిశుభ్రత వంటి నాలుగు అంశాలపై ప్రభుత్వం భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ అంశాల్లో భక్తుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు ర్యాంకులు కేటాయించారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల వంటి ప్రముఖ క్షేత్రాలను అధిగమించి ఇంద్రకీలాద్రి ప్రథమ స్థానంలో నిలిచింది. భక్తులకు మెరుగైన క్యూలైన్ల నిర్వహణ, నాణ్యమైన ప్రసాదాలు, పరిశుభ్రమైన పరిసరాలు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్నప్పటికీ స్థలాభావ సమస్యలను అధిగమిస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.